ETV Bharat / state

సమయం 10:10 దాటిందో.. ఇకపై జీతం కట్..! - ఆలస్యంగా విధులకు హాజరైతే జీతాల్లో కోత

Salary Cut for Late Attendance: విధులకు ఆలస్యంగా హాజరయ్యే ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమయానికి కార్యాలయాలకు రాకుండా అలసత్యం వహించే ఉద్యోగులను కట్టడి చేసేందుకు ఈ నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే ముఖ ఆధారిత హాజరును.. జనవరి 1 తేదీ నుంచి తప్పనిసరి చేసిన ప్రభుత్వం..ఇక విధులకు ఆలస్యంగా వస్తే జీతాల్లోనూ కోతలు విధించేందుకు సిద్ధమైంది.

Salary Cut for Late Attendance
ఆలస్యంగా విధులకు హాజరైతే ఇక నుంచి జీతాల్లో కోత
author img

By

Published : Dec 30, 2022, 7:19 PM IST

విధులకు ఆలస్యంగా హాజరయ్యే ఉద్యోగుల వేతనాల్లో కోత

Salary Cut for Late Attendance: రాష్ట్రసచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్లు, వివిధ జిల్లాల కార్యాలయాల్లో ఆలస్యంగా విధులకు హాజరైతే ఇక నుంచి జీతాల్లో కోతలు విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ అంతర్గతంగా మెమోను జారీ చేసింది. ఇప్పటికే వివిధ సందర్భాల్లో హాజరుకు సంబంధించి సర్కులర్లు జారీ చేసిన ప్రభుత్వం 10.10 నిమిషాల కంటే ఆలస్యంగా హాజరైతే విధులకు గైర్హాజరు అయినట్టు పరిగణిస్తామని స్పష్టం చేసింది. కార్యదర్శులు సైతం విధిగా సచివలాయానికి హాజరు కావాలని స్పష్టం చేసింది. బయోమెట్రిక్ తో పాటు ముఖ ఆధారిత హాజరును కూడా సచివాలయంతో పాటు జిల్లా కలెక్టరెట్ల వరకూ తప్పనిసరి చేస్తూ సర్కులర్ జారీ చేసింది.

ఇకపై ఆలస్యంగా విధులకు హాజరైతే జీతాల్లో కోత విధించేలా సాధారణ పరిపాలన శాఖ మెమో జారీ చేసింది. సమయానికి కార్యాలయాలకు హాజరు కాకుండా విధి నిర్వహణలో అలసత్వం వహించే వారిని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ఆ మెమోలో పేర్కోంది. సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వుల ప్రకారం.. కార్యాలయాలకు పది నిమిషాల ఆలస్యంగా వచ్చే ఉద్యోగులకు జీతంలో కోత విధించేలా చర్యలు చేపట్టాల్సిందిగా బాధ్యులైన అధికారులు చర్యలు చేపట్టాలని సూచించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు సరిగా పనిచేయడం లేదనే ఫిర్యాదుల నేపథ్యంలో అన్నికార్యాలయాల్లో ముఖ ఆధారిత గుర్తింపును అమలు చేస్తున్నారు. ఉద్యోగులు అంతా 10 గంటల నుంచి 10.10లోపు హాజరు నమోదు చేయాలని,ఆ తర్వాత వచ్చే వారికి ఆలస్యం అయినట్టుగా పేర్కోవాలని సాధారణ పరిపాలన శాఖ పేర్కోంది. ఆలస్యంగా విధులకు హాజరైన వారి జీతాల్లో కోత పెట్టాలని అంతర్గత సర్క్యులర్​లో సూచించారు.

గతంలో జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం బయోమెట్రిక్ హాజరు వేయాలని సూచించినా వివిధ కారణాల వల్ల పూర్తి స్థాయిలో అది అమలు కాకపోవటంతో ఇక జనవరి 1 తేదీ నుంచి ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పనిసరి చేశారు. పూర్తి స్థాయిలో ఫేషియల్ రికగ్నిషన్ హాజరు అమలు అయ్యేంత వరకూ కార్యాలయ ఉన్నతాధికారి వద్ద అటెండెన్స్ రిజిస్టర్ విధానాన్ని అమలు చేయాల్సిందిగా సాధారణ పరిపాలన శాఖ సూచించింది. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. కొన్ని శాఖల్లో పనివేళలతో సంబంధం లేకుండా విధులు నిర్వహించాల్సి ఉన్నందున ఈ నిర్ణయం సరికాదని స్పష్టం చేస్తున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.