ETV Bharat / state

ప్రైవేటు ఆస్పత్రులూ కరోనా రోగుల కోసం సహకరించండి: సబ్ కలెక్టర్ - corona cases in ap latest

కరోన మహమ్మారి రెండోదశ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆసుపత్రుల్లో అందరికీ సరిపోయే పడకలు లేక.. పూర్తి స్థాయిలో వైద్యం అందక.. మరణాల రేటు పెరిగిపోతోంది. ఈ క్రమంలో అందరికీ వైద్యం అందే విధంగా తెనాలి డివిజన్లోని ప్రైవేటు ఆసుపత్రుల యజమానులతో సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ మాట్లాడారు. ఈ విపత్కర పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు ప్రైవేటు ఆసుపత్రులను కూడా కొవిడ్ ఆసుపత్రులుగా మార్చి బాధితులకు చికిత్సా అందించాల్సిందిగా ఆసుపత్రుల యజమానులను కోరారు.

tenali
tenali
author img

By

Published : May 5, 2021, 11:38 AM IST

గుంటూరు జిల్లా తెనాలి డివిజన్ పరిధిలో పేరుగాంచిన ప్రైవేటు పెద్ద ఆసుపత్రుల యజమానులతో సబ్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ ఆయన కార్యాలయంలో సమీక్షించారు. కొవిడ్ రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు సరిపోక.. సరైన సమయంలో వైద్యం అందక.. బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో ప్రైవేటు ఆసుపత్రులను కూడా కొవిడ్ ఆసుపత్రులగా మార్చాలని ఆసుపత్రుల యజమానులతో సబ్ కలెక్టర్ సమావేశమై చర్చించారు. డివిజన్ పరిధిలో మొత్తం తొమ్మిది ఆసుపత్రులను గుర్తించినట్లు తెలిపారు. ఒక్క తెనాలి పట్టణంలో ఐదు ఆసుపత్రులను గుర్తించి యజమానులతో చర్చించారు. పొన్నూరులో సజ్జా ఆసుపత్రి, తెనాలిలో హెల్ప్ ఆసుపత్రి కొవిడ్ సేవలు అందించడానికి ముందుకు వచ్చినట్లు సబ్ కలెక్టర్ చెప్పారు. మిగిలిన ఏడు ఆసుపత్రులు మరో రెండు మూడు రోజుల్లో అందుబాటులోకి వస్తాయన్నారు.

'అనధికారికంగా వైద్యం అందిస్తే కఠిన చర్యలు'

ప్రభుత్వ అనుమతి లేకుండా కొవిడ్ బాధితులకు చికిత్స అందిస్తే కఠిన చర్యలు తప్పవని సబ్ కలెక్టర్ అశోక్ పేర్కొన్నారు. కొవిడ్ బాధితులకు చికిత్స అందించాలనుకుంటే ప్రభుత్వానికి లేక సమర్పిస్తే తప్పకుండా అనుమతి పత్రం మంజూరు చేస్తామన్నారు. ఇప్పటికే తెనాలి పట్టణం, డివిజన్ పరిధిలో అనధికారికంగా కొవిడ్ బాధితులకు చికిత్స చేస్తున్న సమాచారం తమ దృష్టికి వచ్చిందన్నారు. తాము రైడ్ లు చేయకముందే ప్రభుత్వం నుంచి అనుమతిని పొందాలని సూచించారు. తనిఖీలలో పట్టుబడితే ఆసుపత్రుల లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు.

అనుమతి ఉన్న ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ వర్తింపు..

ప్రభుత్వం నుండి అనుమతి ఉన్న ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ ద్వారా 50 శాతం రాయితీ కల్పించి.. బాధితులకు ప్రభుత్వం తరపు నుండి మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 104 ద్వారా తాము రిఫర్ చేసిన బాధితులకు అనుమతి పొందిన ఆసుపత్రులు తప్పనిసరిగా బెడ్ కేటాయించాలన్నారు.

ఇదీ చదవండి: 'మహమ్మారి'పై భయం వీడితేనే జయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.