గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని చావావారిపాలెంలో మొక్కజొన్న తోటలో కండి విరిచి పరదాలపై ఎండ పెడుతున్నారు. ప్రమాదవశాత్తు మొక్కజొన్న వ్యర్ధాలకు నిప్పు అంటుకుని గాలి వీయడంతో అది కాస్త చుట్టు పక్కల ఉన్న అన్ని పొలాలకు వ్యాపించింది. అదే క్రమంలో మూడు ఎకరాలలో మొక్కజొన్న గింజలను ఎండబెట్టి లక్ష్మీనారాయణ అనే రైతు పంటకు ఆ మంటలు అంటుకున్నాయి. స్థానికులు మంటలు ఆర్పేందుకు ఎంత ప్రయత్నించినా ఫలించలేదు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. భారీ ఎత్తున ఆస్తినష్టం జరగకుండా కాపాడినట్లు సిబ్బంది పేర్కొన్నారు. మంటల్లో కాలిపోయిన వంట దాదాపు రూ1.80 లక్షల విలువ చేస్తుందని అన్నారు.
ఇదీ చదవండి: నిర్లక్ష్యమే శత్రువు... సకాలంలో పరీక్షలు ముఖ్యం..