గుంటూరు జీజీహెచ్లో కరోనా రోగుల సమస్యలపై జిల్లాయంత్రాంగం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. గుంటూరు ప్రభుత్వ సర్వజనాస్పత్రికి వచ్చే రోగులను సరిగ్గా ఆదరించడం లేదని.. పడకలు లభ్యం కాక సకాలంలో వైద్యచికిత్సలు అందడం లేదనే విమర్శల వస్తున్న క్రమంలో కొవిడ్ ఓపీ వద్ద ప్రత్యేకంగా వైద్యులను, సిబ్బందిని అదనంగా నియమించారు. వచ్చే రోగులను వారి లక్షణాలను గుర్తించి కరోనా కేర్ సెంటర్కు పంపాలా? లేదా ఆస్పత్రిలో చేర్చాలా? లేదా హోం ఐసోలేషన్ సరిపోతుందా అనే విషయంపై స్పష్టత తెస్తున్నారు.
తక్కువ లక్షణాలు ఉన్నవారిని, ఆక్సిజన్ అంతగా అవసరం లేని రోగులను పక్కనే రైల్ మహల్లోని కొవిడ్ కేర్ సెంటర్లకు పంపిస్తున్నారు. అలాగే డిశ్ఛార్జవుతున్న కొందరు రోగులకు ఇంకా స్పల్ప లక్షణాలుంటే రైల్ మహల్లోని స్టెప్ డౌన్ సెంటర్కు బస్సుల ద్వారా పంపిస్తున్నారు. ఒకవేళ లోపల పడకలు లేకుంటే బస్సులోనే వారు సేదతీరేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా బస్సు కేటాయించింది. దీనివల్ల బయట ఎవరూ పడుకోకుండా బస్సులోనే సేదతీరేలా ఏర్పాట్లు చేసినట్లు జీజీహెచ్ అధికారులు చెప్పారు.
ఇదీ చదవండి: దేశంలో మరో 3.43 లక్షల కేసులు, 4వేల మరణాలు