ETV Bharat / state

AP Empolyees Union: 'నాలుగో దశ ఉద్యమం మొదలైతే.. పరిస్థితి మా చేతుల్లో ఉండదు' - సీపీఎఫ్ కోసం ధర్నా

AP Empolyees Union Rally: గుంటూరులో జూన్ 8న ఏపీజేఏసీ అమరావతి ప్రాంతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. నాలుగో దశ ఉద్యోగులు ప్రత్యక్ష ఉద్యమంలోకి వస్తే పరిస్థితులు తమ చేతుల్లో ఉండవని బొప్పరాజు వెల్లడించారు. రేపు సీఎస్‌తో చర్చలకు వెళ్తున్నట్లు తెలిపారు. తమ ఉద్యమాన్ని చులకనగా చూస్తే ప్రభుత్వానిదే తప్పు అంటూ బొప్పరాజు వెల్లడించారు.

AP Empolyees
Empolyees Union Rally
author img

By

Published : May 31, 2023, 5:11 PM IST

Bopparaju venkateswarlu: గుంటూరులో జూన్ 8న ఏపీ జేఏసీ అమరావతి ప్రాంతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. సదస్సుకు సంబందించిన పోస్టర్లను బొప్పరాజు ఆవిష్కరించారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఏపీజేఏసీ ఆధ్వర్యంలో 84 రోజులుగా ఉద్యమిస్తున్నామని బొప్పరాజు వెల్లడించారు. తమ ఉద్యమాల ఫలితంగానే ప్రభుత్వం కొన్ని జీవోలు ఇచ్చిందని బొప్పరాజు వెల్లడించారు. అయినప్పటికీ ఇంకా కొన్ని ప్రధాన డిమాండ్లు మాత్రం పరిష్కారం కాలేదని బొప్పరాజు వెల్లడించారు.

సదస్సు పోస్టర్లను ఆవిష్కరించిన జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు

జూన్ 10లోపు తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమం తీవ్రం చేస్తామని బొప్పరాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమానికి వామపక్షాలు మద్దతు తెలిపాయని బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. నాలుగో దశలో ఉద్యోగులు ప్రత్యక్ష ఉద్యమంలోకి వస్తారని బొప్పరాజు పేర్కొన్నారు. నాలుగో దశ ఉద్యోగులు ప్రత్యక్ష ఉద్యమంలోకి వస్తే పరిస్థితులు తమ చేతుల్లో ఉండవని బొప్పరాజు వెల్లడించారు. రేపు సీఎస్‌తో చర్చలకు వెళ్తున్నట్లు బొప్పరాజు తెలిపారు. తమ ఉద్యమాన్ని చులకనగా చూస్తే ప్రభుత్వానిదే తప్పు అంటూ బొప్పరాజు వెల్లడించారు.

పీఆర్‌సీ జీవోల అమలు నిలిపివేసే వరకు చర్చలకు వెళ్లం - ఉద్యోగ సంఘాలు

ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన్ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సిద్ధమవుతున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కడప జిల్లా అధ్యక్షులు రమేష్ బాబు స్పష్టం చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కడప కలెక్టరేట్ ఎదుట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. చేతిలో ప్ల కార్డులు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి.. వారం రోజులు కాదు కదా నాలుగేళ్లు పూర్తి అయినప్పటికీ... సీపీఎస్ మాట ఎత్తకపోవడం దారుణమని ఖండించారు. పైగా సజ్జల రామకృష్ణారెడ్డి అవగాహన లేకుండా హామీ ఇచ్చామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. న్యాయ బద్ధంగా రావాల్సిన తమ హక్కులను హరిస్తున్నారని రమేష్ బాబు ఆరోపించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు దాదాపు 20 వేల కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్​లో ఉన్నాయని చెప్పారు. ఈ బకాయిలను తక్షణం చెల్లించకపోతే మరింత పెరిగే అవకాశం ఉందని మేష్ బాబు తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు.

అక్టోబరు 31 ప్రభుత్వానికి డెడ్ లైన్ విధిస్తున్నామని, సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టకుంటే నవంబరు 1 తర్వాత నిరవధిక సమ్మెకు దిగి రాష్ట్ర ప్రభుత్వానికి సినిమా చూపిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నేతలు హెచ్చరించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లా.. టెక్కలిలో సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో రిలే నిరాహార దీక్ష శిబిరం ఏర్పాటుచేసి నిరసన తెలిపారు. ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీమేరకు తక్షణమే సీపీఎస్ రద్దు చేసి పాతపింఛను విధానం అమలు చేయాలని డిమాండు చేశారు. ఒక్కరోజు ఎమ్మెల్యేగా, ఎంపీగా పని చేసినవారు జీవితాంతం పింఛను తీసుకుంటున్నారని, 40ఏళ్లపాటు ప్రభుత్వ సర్వీసులో పని చేస్తున్నవారికి వృద్ధాప్య దశలో భరోసా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు రెగ్యులర్ చేయాలని, ఉద్యోగులపై కక్షసాధింపులు వీడి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఉద్యోగుల సంఘ నేతలు కోరారు.

AP Empolyees Union Rally: 'పీఆర్‌సీ సహా.. వాటిపైనా ప్రభుత్వం స్పందించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.