లాక్ డౌన్ వేళ రోడ్లపై విధులు నిర్వహిస్తూ పోలీసులు పడుతున్న కష్టాన్ని చూసి చలించిన ఓ మహిళ వారికి శీతల పానీయం తెచ్చి ఇచ్చింది. తూర్పు గోదావరి జిల్లా తునిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. చిన్నపాటి పనులు చేసుకునే ఆ మహిళ పోలీసులపై చూపిన ఔదార్యంపై ప్రశంసలు వచ్చాయి. ఆ ఘటన రాష్ట్ర డీజీపీని సైతం కదిలించింది. ఆయనే ఇవాళ వీడియో కాల్ ద్వారా ఆ మహిళతో మాట్లాడారు.
తుని పోలీసులు ఆమెను వెంటబెట్టుకుని వీడియో కాన్ఫరెన్స్ లో డీజీపీతో మాట్లాడించారు. కాన్ఫరెన్స్ ద్వారానే డీజీపీ సవాంగ్ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. అమ్మతనాన్ని చూపించారని కొనియాడారు. అందుకు ఆ మహిళ కూడా నవ్వుతూ రెండు చేతులు జోడించి నమస్కరించింది. మహిళ చూపిన ఔదార్యం... పోలీస్ బాస్ ఆమెతో మాట్లాడటం... ఇవన్నీ ప్రజలు - పోలీసుల మధ్య సుహృద్భావ వాతావరణం పెంచేలా ఉన్నాయి.
ఇవీ చదవండి: