ETV Bharat / state

విద్యుత్‌ ఛార్జీల భారంపై ప్రజల్లో ఆందోళన - ap current bills news

విద్యుత్‌ ఛార్జీల భారంపై వినియోగదారులు తీవ్రంగా మండిపడుతున్నారు. బిల్లులు షాక్‌ కొట్టేలా ఉన్నాయంటున్న ప్రజలు వేసవితో పాటు కరోనా వినియోగం పేరుతో, ప్రభుత్వం అధికంగా వసూలు చేస్తోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

విద్యుత్‌ ఛార్జీల భారంపై ప్రజల్లో ఆందోళన

author img

By

Published : May 14, 2020, 6:52 PM IST

విద్యుత్‌ ఛార్జీల భారంపై ప్రజల్లో ఆందోళన

విద్యుత్‌ ఛార్జీలు వినియోగదారులను బెంబేలెత్తిస్తున్నాయి. బిల్లులను అందుకుంటున్న వినియోగదారులు చెల్లించాల్సిన మొత్తాన్ని చూసి కంగుతింటున్నారు. సాధారణంగా వేసవిలో విద్యుత్‌ వినియోగం అధికంగా ఉంటుంది. దీనికి కరోనా విధించిన లాక్‌డౌన్‌ తోడవడంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఫలితంగా బిల్లులు కొంత మేర అధికంగా వస్తాయని అంచనా వేశామని, కానీ ఇంత భారంగా మారతాయని అనుకోలేదని వినియోగదారులు వాపోతున్నారు. కరోనా నేపథ్యంలో ఏప్రిల్‌లో రీడింగ్‌ తీయలేదని, అంతకు ముందు నెల వినియోగం ఆధారంగానే బిల్లులు చెల్లించామని చెబుతున్నారు. అలాంటి వారికీ ఛార్జీలు షాక్‌ కొట్టేలా ఉన్నాయని అంటున్నారు. ఎప్పుడూ వచ్చే బిల్లుకు రెండు, మూడు రెట్లు అదనంగా రావడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని వేసవి వినియోగం పేరుతో ప్రభుత్వం తమ నుంచి భారీగా వసూలు చేస్తోందని ఆరోపిస్తున్నారు.

మరోవైపు వినియోగించిన దానికంటే ఒక్క యూనిట్‌కు కూడా అధికంగా బిల్లింగ్‌ చేయలేదని టారిఫ్‌, బిల్లింగ్‌ విధానాన్ని అర్థం చేసుకోవడంలోనే సమస్య ఎదురవుతుందని ట్రాన్స్‌కో సీఎండీ శ్రీకాంత్‌ చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో చూసుకున్న తర్వాత కూడా అనుమానాలు ఉంటే 1912 నంబర్‌కు ఫోన్‌ చేసి నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. బిల్లులు కట్టేందుకు జూన్‌ నెల 30వ తేదీ వరకు అవకాశం ఉందన్న సీఎండీ అప్పటి వరకు ఎలాంటి అపరాధ రుసుము వసూలు చేయరని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి

కరెంట్ బిల్లులు అదనంగా వసూలు చేయట్లేదు: ట్రాన్స్​కో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.