రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని.. ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భానోజీరావు గుంటూరులో విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ధరలు చుక్కలు తాకుతున్న పరిస్థితుల్లో... తక్కువ జీతాలతో అల్లాడుతున్నామని.. పీఆర్‌సీ ద్వారా వేతనాలు పెంచాలని కోరారు. గుంటూరులో ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు సమవేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించింది.
వివిధ దశల్లో నిరసన ఉద్ధృతం చేయనున్నామని సంఘం రాష్ట్ర కార్యదర్శి భానోజీ రావు చెప్పారు. త్వరలో జిల్లా, మండల వివిధ శాఖల అధికారులకు.. తర్వాత ప్రజా ప్రతినిధులకు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజ్ఞాపన పత్రాలు అందజేయనున్నామని చెప్పారు. ప్రభుత్వం స్పందించకపోతే నిరసన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని భానోజీరావు తెలిపారు.
ఇదీ చదవండి: