కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే.. దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్వలి అన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన రామతీర్దంలో శ్రీరాముని విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. విగ్రహాన్ని ప్రతిష్ఠించి సమస్యను పరిష్కరించకుండా వైకాపా, తెదేపా, భాజపా, జనసేనలు రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు. రామతీర్థాన్ని నాలుగు పార్టీలు కలిసి రణరంగంగా మార్చి రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు. పథకం ప్రకారం ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయో.. జరిగిన వెంటనే ముందు వారికే ఎందుకు తెలుస్తున్నాయో భాజపా సమాధానం చెప్పాలని మస్తాన్ వలి డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: