ETV Bharat / state

AP CID Fourth Day Raids in Margadarsi Branches: కొనసాగుతున్న కక్ష సాధింపు.. నాలుగో రోజు మార్గదర్శి బ్రాంచ్​ల్లో సోదాలు - మార్గదర్శి

AP CID Fourth Day Raids in Margadarsi Branches: మార్గదర్శి చిట్‌ఫంట్‌పై వైసీపీ ప్రభుత్వ వేధింపులు పరాకాష్టకు చేరాయి. వ్యాపారం సాగకుండా చేసే కుట్రలో భాగంగా చిట్టీల పాటకు ప్రభుత్వ అధికారులు అడ్డంకులు సృష్టించారు. మొత్తం ప్రక్రియను సెల్‌ఫోన్లో చిత్రీకరించారు. కొన్నిచోట్ల చందాదారులు ఎదురు తిరగడంతో తనిఖీ అధికారులు వెనక్కుతగ్గారు.

AP_CID_Fourth_Day_Raids
AP CID Fourth Day Raids in Margadarsi Branches కొనసాగుతున్న కక్ష సాధింపు..
author img

By

Published : Aug 20, 2023, 2:18 PM IST

Updated : Aug 21, 2023, 8:20 AM IST

AP CID Fourth Day Raids in Margadarsi Branches: కొనసాగుతున్న కక్ష సాధింపు.. నాలుగో రోజు మార్గదర్శి బ్రాంచ్​ల్లో సోదాలు

AP CID Fourth Day Raids in Margadarsi Branches: రాష్ట్రవ్యాప్తంగా మార్గదర్శి కార్యాలయాల్లో సీఐడీ, రిజిస్ట్రేషన్, రెవెన్యూ, తదితర శాఖల అధికారులు ఆదివారం నాలుగో రోజూ సోదాలు కొనసాగించారు. చిట్టీ పాటను అధికారులు సెల్‌ఫోన్లో వీడియో చిత్రీకరించారు. పాట పాడేందుకు వచ్చిన చందాదారులు, ఏజెంట్ల పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఆక్షన్ ప్రక్రియకు అడ్డంకులు సృష్టించేలా హడావుడి చేశారు. దీంతో చందాదారులు కొన్నిచోట్ల సీఐడీ అధికారులకు ఎదురుతిరిగారు. మార్గదర్శిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. సంస్థ తమకు ఎలాంటి ఇబ్బందులూ కలిగించలేదని తేల్చి చెప్పారు. దీంతో అధికారులు వెనక్కి తగ్గారు. పలుచోట్ల చందాదారులను అధికారులు వేధింపులకు గురిచేశారు.

YSRCP Government Actions on Margadarsi న్యాయానికి చెల్లుచీటీ.. ‘ఈనాడు’ గొంతు నొక్కటమే అసలు ఎజెండా

Raids in Margadarsi Branches: కృష్ణా, NTR జిల్లాల్లోని 5కార్యాలయాల్లో ఆక్షన్ ప్రక్రియకు ఆటంకాలు కలిగించేలా అధికారులు హడావుడి చేశారు. చిట్ పాడేందుకు వచ్చినవారు, ఏజెంట్లపై ప్రశ్నల వర్షం కురిపించారు. వారి స్టేట్‌మెంట్లు తీసుకుని, వీడియోలు చిత్రీకరించారు. విజయవాడ వన్ టౌన్ మార్గదర్శి శాఖలో అధికారులు ఆక్షన్‌ హాలులోనే ఉండి ఆటంకాలు కలిగించేందుకు ప్రయత్నించారు. దీని వల్ల పాట పాడేందుకు వచ్చిన చందాదారులు, ఏజెంట్లు ఇబ్బందిపడ్డారు. అధికారులు దురుసుగా ప్రవర్తిస్తుండటంతో మార్గదర్శి సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై నందిగామకు చెందిన మార్గదర్శి ఏజెంట్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయవాడలోని లబ్బీపేట శాఖలో చిట్ పాడేందుకు వచ్చిన వారి వివరాలు నమోదు చేసుకున్నారు. గవర్నర్ పేట బ్రాంచిలో సీఐడీ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చిట్ వేలంలో పాల్గొనేందుకు వచ్చిన సభ్యుల ఫొటోలను సెల్‌పోన్‌లో తీసుకున్నారు. ఏజెంట్లను గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. కమీషన్ ఎలా ముడుతుంది? ఎన్ని చిట్లలో ఎంత మందిని చేర్చించారని ఆరా తీశారు. వారి స్టేట్ మెంట్లు నమోదు చేసుకున్నారు. గుడివాడ, మచిలీపట్నంలోని శాఖల్లోనూ వేలం ప్రక్రియను వీడియో తీశారు. చందాదారుల చిరునామాలు, ఫోన్ నంబర్లను సేకరించారు. వేలం ముగిసిన తర్వాత వారి నుంచి స్టేట్మెంట్లను రికార్డు చేశారు.

AP CID Officers Attend to Telangana High Court: మార్గదర్శి కేసు.. ఏపీ సీఐడీ అధికారులపై తెలంగాణ హైకోర్టు అసహనం

Raids in Chittoor Margadarsi Branches: చిత్తూరు మేనేజర్ పంచనామా పత్రంపై సంతకాలు పెట్టకుండా ఇంటికి ఎలా వెళ్తారని అక్కడున్న మిగతా సిబ్బందిని సీఐడీ అధికారులు గదమాయించారు. దీనిపై ఉన్నతాధికారులకు చిట్స్ రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారు. అనంతరం రాత్రి 7 గంటలకు సీఐడీ అధికారులు మార్గదర్శి కార్యాలయం నుంచి బయలు దేరుతుండగా మొబైల్ ఫోన్లో వీడియో తీస్తున్న ఈటీవీ ప్రతినిధి ఫోన్ను సీఐడీ అధికారులు లాక్కున్నారు. ఆ ఫోన్లోని మొత్తం డేటాను రికవరీ చేయాలని సిబ్బందిని అధికారులు ఆదేశించారు. ఈనాడు, ఈటీవీ ప్రతినిధులు అదేమని గట్టిగా ప్రశ్నించడంతో మొబైల్ ఫోన్ ఇచ్చి వెళ్లిపోయారు.

ఒంగోలు మార్గదర్శి కార్యాలయంలో అధికారులు ప్రతి ఒక్కరినీ వీడియోలు తీస్తూ ఇబ్బందులకు గురిచేశారు. చందాదారులు ఎవరెవరు వస్తున్నారు? వెళుతున్నారు? అనే విషయాన్ని ఓ అధికారితో వీడియోలు, ఫొటోలు తీయించారు. సంతకం పెట్టాలని ఒక ఉద్యోగిని బెదిరించారు.

AP CID Raids in Margadarsi Branches కోర్టు ఆదేశాలు బేఖాతరు.. మార్గదర్శిపై మళ్లీ దాడులు.. మూసివేత లక్ష్యంగా చర్యలు..

Raids in Margadarsi Branches: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 5 కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగాయి. విశాఖ జిల్లా పీఎం పాలెం శాఖలో బెదిరింపు ధోరణితో సీఐడీ అధికారులు ప్రశ్నలు వేయడంతో.. చందాదారులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తోంది కక్షసాధింపు చర్యలే తప్ప.. తమకు మార్గదర్శి సంస్థ ఎలాంటి ఇబ్బందులూ కలిగించడంలేదని తేల్చిచెప్పారు. భీమవరం కార్యాలయంలో మేనేజర్ లేకుండా ఆక్షన్ ఎలా నిర్వహిస్తారని, దాన్ని ఆపాలని అధికారులు అక్కడి సిబ్బందిని ఆదేశించారు. తాము పాట పాడుకునేందుకు ఎంతో దూరం నుంచి వస్తే.. ఆపమనడం ఏంటని చందాదారులు ఎదురుతిరగడంతో అధికారులు.. పాటను యధావిధిగా కొనసాగించారు.

తెనాలి కార్యాలయానికి వచ్చిన చందాదారులను అధికారులు దాదాపు గంటపాటు రకరకాల ప్రశ్నలు వేసి సమాచారాన్ని సేకరించారు. నర్సరావుపేటలో చందాదారుల తరుపున చిట్టీపాటలో పాల్గొన్న ఏజెంట్ల నుంచి అధికారులు వాంగ్మూలాలు నమోదు చేశారు. మండపేటలో మేనేజర్ కృష్ణారావు మధ్యాహ్నం తర్వాత కార్యాలయానికి రావాలని సీఐడీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ ఆయనపై ఒత్తిడి తెచ్చారు. మార్గదర్శి సిబ్బంది ఫోన్ నంబర్లను అధికారులు సేకరించారు. నెల్లూరు జిల్లా వేదాయపాళెం శాఖలో అధికారులు రాసిన పత్రాలపై సంతకాలు చేయాలని ఏజెంట్లను ఒత్తిడి చేశారు.

Supreme Court on Margadarsi Case: 'మార్గదర్శి చిట్‌ఫండ్‌ కేసు బదిలీ కుదరదు'.. ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు

Last Updated : Aug 21, 2023, 8:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.