గుంటూరు జిల్లాలో కొవిడ్ కేసుల వ్యాప్తి కొనసాగుతోంది. జిల్లాలో సోమవారం కొత్తగా 87 కేసులు నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 73,484కి చేరింది. ఇవాళ నమోదైన కేసుల్లో అత్యధికంగా గుంటూరు నగరం నుంచి 24 కేసులు ఉన్నాయి. అమర్తలూరులో 9, చేబ్రోలులో 8, మాచర్లలో 7, మంగళగిరిలో 5, తాడికొండలో 4 కేసుల చొప్పున నమోదయ్యాయి.
తాజాగా మరో 880 మంది కరోనా నుంచి కోలుకోగా... డిశ్ఛార్జి అయిన వారి సంఖ్య 71,951కు చేరింది. వైరస్ బారిన పడి గుంటూరులో మరొకరు మృతి చెందారు. దీనితో సహా మొత్తం 653 మంది మృత్యువాత పడ్డారు.
ఇదీ చదవండి