గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పాతూరులో కురుసిన వర్షాలకు అంగన్వాడీ కేంద్రం నీట మునిగింది. రెండురోజుల నుంచి కురుస్తున్న మోస్తారు వర్షాలకే అంగన్వాడీ కేంద్రంలోకి నీళ్లు వచ్చాయి. పల్లపుప్రాంతంలో ఉండటం వల్ల నీళ్లు వచ్చాయని ఐసీడీఎస్ అధికారులు తెలిపారు. ఈ కేంద్రంలో ఉన్న చిన్నారులను పక్కనే ఉన్న చర్చిలోకి తరలించారు.
ఇదీ చదవండి:నీటిపాలైన పంటపై రైతుల ఆవేదన