ETV Bharat / state

Andhra Pradesh Tenant Farmers in Dire Situation: అర్హత కలిగిన కౌలు రైతులకు అందని పెట్టుబడి సాయం - కౌలు రైతులపై ప్రభుత్వ విధానం

Andhra Pradesh Tenant Farmers in Dire Situation: కౌలు రైతుల విషయంలో ప్రభుత్వం చెబుతున్న అంశాలకూ... క్షేత్రస్థాయిలో పరిస్థితులు, భిన్నంగా ఉన్నాయి. కౌలు రైతులకు పంటసాయం లబ్ధి అర్హులకు అందటం లేదు. రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలు రైతులు ఉంటే ప్రభుత్వం కేవలం లక్ష 46 వేల మందికి మాత్రమే పెట్టుబడి సాయం విడుదల చేయటంపై కౌలు రైతు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం

Andhra Pradesh Tenant Farmers in Dire Situation

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 3, 2023, 7:34 PM IST

Andhra Pradesh Tenant Farmers in Dire Situation: ఆర్హత ఉంటే చాలు ప్రభుత్వం పథకాలను నేరుగా అందిస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రతి సమావేశంలోనూ ఉదరగొడుతున్నారు. ముఖ్యమంత్రి ప్రకటనలకు క్షేత్ర స్థాయిలో పరిస్థితులకు పూర్తి భిన్నంగా ఉంది. కౌలు రైతులకు తాము అండగా నిలుస్తామని, వారికి పెట్టుబడి సాయం అందిస్తున్నామని నిన్న ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి నిధులు విడుదలు చేశారు. అయితే బటన్ నొక్కింది గొరంత అయితే ఆర్హత ఉండి, లబ్దిపొందని రైతులు వేలల్లో ఉన్నారు. కౌలు రైతులకు కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం విధించిన నిబంధనలే తమను పథకానికి దూరం చేశాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి యాజమాని అనుమతి ఉంటేనే తమకు కౌలు కార్డు ఇస్తామని చెప్పడం చూస్తే పథకాలు ఇవ్వకూడదనే ప్రభుత్వం ఈ నిబంధన విధించిందని రైతులు ఆనుమానం వ్యక్తం చేస్తున్నారు. భూ యాజమానులు అసలు కౌలుదారులకు కార్డలు ఇచ్చేందుకు విముఖత చూపడంతో చాలామంది కౌలు కార్డులు పొందలేకపోయారు.

Farmers problems: రైతుకి 'భరోసా' ఇవ్వని కేంద్రాలు.. దీంతో ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు

Restrictions on Funds to Tenant Farmers: కౌలు రైతులకు తాము అండగా నిలుస్తామని..పెట్టుబడి సాయం అందిస్తున్నామని సీఎం జగన్ ఆర్భాటంగా బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. కానీ ఆచరణలో కౌలు రైతులకు ప్రతి సంవత్సరం కొత విధిస్తున్నారు. నిధులు విడుదలైనా... అర్హత ఉండి లబ్ధి పొందలేని కౌలురైతులు వేలల్లో ఉన్నారు. కౌలు రైతులకు కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం విధించిన నిబంధనలే తమను పథకానికి దూరం చేశాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూ యాజమానులు...కౌలు దారులకు భూ హక్కుపత్రాలు ఇచ్చేందుకు విముఖత చూపడంతో వారికి లబ్ధి చేకూరటంలేదు. సెంటు భూమి లేని కౌలు రైతులకు సీసీఆర్సీ ఉన్నా..ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల్లో కేవలం 10 శాతం మందికే ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తోంది. అగ్రవర్ణ కౌలుదారులకు పెట్టుబడి సాయం వర్తింపచేయకపోవటంపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

AP Farmers: అన్నదాతకు మాటల్లోనే సాయం.. చేతల్లో చేతులెత్తేస్తున్న వైఎస్సార్​సీపీ ప్రభుత్వం

Favour to Landlords and their Relatives : భూ యజమానుల వారి కటుంబ సభ్యులు, వారి బంధువుల పేరిట కౌలు కార్డులు తీసుకుని లబ్ది పొందుతున్నారని కౌలు రైతులు వాపోయారు. కౌలు రైతులకు జాతీయ బ్యాంకులు లేకపోతే సహకార సంఘాలు పరపతి సౌకర్యం కల్పించడం లేదని కౌలు రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. వేలకు వేలు అప్పులు చేసి పంటలు పండించినా..చిన్న సమస్య ఎదురైనా తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వం అర్హత కలిగిన ప్రతి ఒక్క కౌలు రైతుకు న్యాయం చేయాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న కౌలు రైతు భరోసా లబ్ది అసలైన కౌలుదారులకు చేరడం లేదు. రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలు రైతులు ఉంటే ప్రభుత్వం కేవలం లక్ష 46 వేల మందికి మాత్రమే పెట్టుబడి సాయం విడుదల చేసింది. మరి మిగిలిన కౌలు రైతుల సంగతేంటని కౌలు రైతు సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

Farmer Suicides in Kurnool ఒకేరోజు ఉమ్మడి కర్నూలులో నలుగురు రైతుల ఆత్మహత్య.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.