తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా జరిగింది. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, పలువురు ఎమ్మెల్యేలు, నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్ర ఏర్పాటులో పొట్టి శ్రీరామలు చేసిన త్యాగాలను కొనియాడారు.
పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగాలకు ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆ మహనీయుడి స్పూర్తి కొనసాగాలనే సీఎం జగన్ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుతున్నారన్నారు. మహనీయుల ఆశయాలను నెరవేర్చేలా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
ఇదీ చదవండి: ఆ రాష్ట్రాల ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు