రాజధాని రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని వైకాపా ప్రభుత్వం మోసగించిందని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. కమీషన్లు దండుకునేందుకే వైకాపా... కాంట్రాక్టర్లకు 6 వేల 500 కోట్లు విడుదల చేశారని దుయ్యబట్టారు. కౌలు రైతులను ఆదుకునేందుకు మాత్రం ప్రభుత్వానికి చేతులు రావడం లేదని మండిపడ్డారు.
కరోనా మహమ్మారి వెంటాడుతున్నా... భౌతిక దూరం పాటిస్తూ 115 రోజుల నుంచి రాజధాని మహిళలు, రైతులు దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: చైనాలో మళ్లీ కరోనా ప్రకంపనలు- అమెరికాలో వికృత రూపం