గుంటూరు జిల్లా కర్లపాలెంలో ఆస్తి వివాదంలో ఓ వృద్ధుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మండలంలోని ఏటవారిపాలెం పంచాయతీ పరిధిలోని 45 సెంట్ల స్థలం విషయంలో చీరాల నాగేశ్వరరెడ్డి, ఏట్ర వెంకటేశ్వరరెడ్డి కుటుంబాల మధ్య వివాదాలు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. మనస్థాపానికి గురైన ఏట్ర వెంకటేశ్వరరెడ్డి (60) ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అడ్డుకున్న పోలీసులు.. అతన్ని బాపట్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు కర్లపాలెం ఎస్సై పేర్కొన్నారు.
ఆస్తి వివాదంలో వృద్ధుడి ఆత్మహత్యాయత్నం
ఆస్తి వివాదంలో ఓ వృద్ధుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా కర్లపాలెం సెంటర్లో జరిగింది.