ETV Bharat / state

అయేషా మీరా మృతదేహానికి మరోసారి శవపరీక్ష - ఆయేషామీరా కేసులో సీబీఐ విచారణ

అయేషా మీరా మృతదేహానికి మరోసారి శవపరీక్ష నిర్వహిస్తున్నారు అధికారులు. గుంటూరు జిల్లా తెనాలిలోని చెంచుపేటలో ఉన్న శ్మశాన వాటికలో శవపరీక్ష జరగుతోంది. హత్య జరిగిన 12 సంవత్సరాల తర్వాత ఈ ప్రక్రియను చేపడుతున్నారు.

An autopsy is scheduled for Ayesha's body today
అయేషా మృతదేహం
author img

By

Published : Dec 14, 2019, 6:18 AM IST

Updated : Dec 14, 2019, 9:51 AM IST

అయేషా మీరా మృతదేహానికి మరోసారి శవపరీక్ష

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్య కేసుపై సీబీఐ విచారణలో మరో ముందడుగు పడింది. గుంటూరు జిల్లా తెనాలిలో ఆమె మృతదేహానికి మరోసారి శవపరీక్ష జరుపుతున్నారు అధికారులు. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు విజయవాడ కోర్టులో ధ్వంసమైనందున ఆధారాల సేకరణ సీబీఐకి పెద్ద సవాల్​గా మారింది. అందుకే మృతదేహానికి మరోసారి శవపరీక్ష చేయాలని నిర్ణయించారు. అయితే ఈ ప్రక్రియ ముస్లిం మత సంప్రదాయలకు విరుద్ధమని అయేషామీరా తల్లిదండ్రులు అంగీకరించకపోవటంతో సీబీఐ అధికారులు కోర్టుని అశ్రయించి అనుమతి పొందారు. తెనాలిలోని చెంచుపేటలో ఉన్న శ్మశానవాటికలో అయేషా మృతదేహాన్ని ఖననం చేశారు. ఇపుడు అక్కడే మరోసారి శవపరీక్ష జరగుతోంది. అయితే హత్య జరిగిన 12 సంవత్సరాల తర్వాత శవపరీక్ష జరుగుతున్నందున మృతదేహం పూర్తిగా పాడైపోయింది. కేవలం ఎముకలు, గోళ్లు, కేశాలే ఉన్నాయి. ఇపుడు శవపరీక్షలో వైద్యులు ఏం చేస్తారు?... మృతదేహం ఆనవాళ్ల నుంచి సీబీఐ అధికారులు ఎలాంటి ఆధారాలు సేకరిస్తారనేది ఆసక్తిగా మారింది.

ఇదీ చదవండి

దిశ నిందితుల మృతదేహాలు భద్రపరచండి: తెలంగాణ హైకోర్టు

Intro:రాజు ఈ టీవీ తెనాలి కిట్టు నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3

Body:గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బీఫార్మసీ విద్యార్థి ఆయేషా మీరా cbi పోస్టుమార్టం నిర్వహిస్తుంది

స్క్రిప్టు యూనిట్ ఆఫీస్ నుంచి వచ్చింది విజువల్స్ మోజో నుంచి పంపిస్తున్నాను

Conclusion:గుంటూరు జిల్లా తెనాలిలో బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా రీ పోస్టుమార్టం
Last Updated : Dec 14, 2019, 9:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.