గుంటూరు జిల్లా బాపట్లలో ప్రేమ పేరిట మైనర్ బాలికను ఆటోడ్రైవర్ గర్భవతిని చేసిన ఘటన కలకలం రేపింది. బాపట్ల పట్టణానికి చెందిన పదో తరగతి విద్యార్ధినిని ఆటో డ్రైవర్ మణికుమార్ ప్రేమ పేరిట వలలో వేసుకున్నాడు. బాలికను గర్భవతిని చేశాడు. బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో బాలిక ఇవాళ ప్రసవించింది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆటో డ్రైవర్ మణికుమార్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు బాపట్ల పట్టణ సీఐ కృష్ణయ్య తెలిపారు.
ఇదీ చదవండి:
ACCIDENT: ఆగివున్న లారీని ఢీ కొట్టిన మినీ ట్రాలీ.. ఐదుగురికి గాయాలు