pawan kalyan to sabha: అమరావతి పాదయాత్ర ముగింపు సభలో పాల్గొంటానని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ హామీ ఇచ్చినట్లు మహిళా రైతులు పేర్కొన్నారు. తొలినుంచీ రాజధాని ఉద్యమానికి మద్దతుగా ఉన్నారంటూ మంగళగిరిలో పవన్‌కల్యాణ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా యాత్ర ముగింపు సభకు ఆహ్వానించగా.. వస్తానని చెప్పారని మహిళలు వివరించారు. అన్ని పక్షాల మద్దతుతో అమరావతి నుంచి రాజధాని తరలిపోకుండా కాపాడుకుంటామని మహిళలు ధీమా వ్యక్తంచేశారు.
తిరుపతిలో నిర్వహించనున్న పాదయాత్ర ముగింపు సభకు పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. దీనిపై రైతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా అనుమతి నిరాకరించారని ఆరోపించారు. సభకు అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: