ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొసాగించే అంశంలో... కేంద్రం జోక్యం చేసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిని అమరావతి పరిరక్షణ మహిళా జేఏసీ కోరింది. అమరావతి పరిరక్షణ కోసం దిల్లీలో పర్యటిస్తూ జాతీయ, ప్రాంతీయ నేతలతో పాటు కేంద్రంలోని నేతలను మహిళా నేతలు, రైతులు కలుస్తున్నారు.
ఇందులో భాగంగా ఈ రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నార్త్ బ్లాక్‌లోని ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. అమరావతి కోసం రైతుల త్యాగాలను ఆయనకు వివరించారు. హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లను సమీక్షించాలని కోరారు. తమ సమస్యలపై మంత్రి కిషన్‌రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు మహిళలు తెలిపారు. రైతులకు అన్యాయం జరగనివ్వమని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. అనంతరం తెరాస ఎంపీ కేశవరావును కలిసిన ఐకాస నేతలు, మహిళలు అమరావతికి మద్దతు ఇవ్వాలని కోరారు. అమరావతి రైతుల పట్ల వైకాపా ప్రభుత్వ తీరును వివరించారు.
ఇదీచదవండి.