రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో రైతులు ఆందోళన చేస్తున్నారు. వీరిని అదుపు చేయటానికి పోలీసులు భారీగా మోహరించారు. సచివాలయం, హైకోర్టుకు వెళ్లే వాహనాలను పోలీసు సిబ్బంది మళ్లిస్తున్నారు.
పురుగు మందుల డబ్బాలతో నిరసన
తుళ్లూరులో రాజధాని ప్రాంత రైతుల రహదారి దిగ్బంధం చేసి ఆందోళన చేస్తున్నారు. పురుగుల మందు డబ్బాలతో నిరసన చేస్తున్నారు. విజయవాడ-అమరావతి మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమస్య పరిష్కారమయ్యేవరకు రహదారులు దిగ్బంధం చేస్తామని రైతులు వాపోతున్నారు.మూడు రాజధానుల ప్రకటన ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించి నిర్మాణాలు చేపట్టాలని ఆందోళన చేస్తున్నారు.
రాయపూడిలో రైతుల ఆందోళన
యపూడిలో రైతుల ఆందోళనలు చేస్తున్నారు. 3 రాజధానుల ప్రకటనను సీఎం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని నిరసన చేస్తున్నారు.
మందడంలో కలకలం...
మందడంలో రైతుల ఆందోళన వద్ద కలకలం చెలరేగింది. జై విశాఖ అంటూ పోస్టర్ ప్రదర్శించిన వ్యక్తి పైకి స్థానికులు దూసుకెళ్లారు. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.