Amravati farmers going to Shirdi: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న దీక్షలు 790 రోజు కొనసాగుతున్నాయి. మహిళలు, రైతులు, యువత ప్రభుత్వ తీరుపై రోజుకో రూపంలో తమ నిరసన తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా రాజధాని రైతులు, మహిళలు శిరిడీ బయలుదేరి వెళ్లారు.
విజయవాడ నుంచి సుమారు 40 మంది ‘జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్.. అమరావతిని రక్షించండి’ అంటూ నినాదాలు చేస్తూ శిరిడీ సాయి దర్శానికి బయలుదేరి వెళ్లారు. మూడు రాజధానుల నిర్ణయం మార్చుకుని, రాజధానిగా అమరావతినే కొనసాగించేలా ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి మనసు మారాలని సాయిబాబాను వేడుకోనున్నట్లు రైతులు తెలిపారు. అమరావతి కోసం ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు.
ఇదీ చదవండి: మరింత ఉద్ధృతంగా మారనున్న అమరావతి ఉద్యమం.. రైతులంతా కలిసి..