కరోనా లాక్ డౌన్ సందర్భంగా గుంటూరులో ఆహారం దొరక్క ఇబ్బందులు పడుతున్న వారికి అమ్మ ఛారిటబుల్ ట్రస్టు తరపున భోజనం పెడుతున్నారు. వీటికోసం గుంటూరు జిల్లా మోతడక గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ నిమ్మగడ్డ అఖిల్ లక్ష రూపాయల విరాళం అందించారు. అమెరికాలో ఉంటున్న అఖిల్ తన తండ్రి హనుమంతరావు ద్వారా ట్రస్టు నిర్వాహకులకు నగదును అందించారు. రోజువారి కూలీలు, బిచ్చగాళ్లు, లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. వారిని ప్రభుత్వం పునరావాస కేంద్రాల్లో ఉంచింది. వీరికి అమ్మ ఛారిటబుల్ ట్రస్టు ఆహారం అందిస్తోంది. ఈ విషయంపై ఈటీవీ భారత్, ఈటీవీ, ఈనాడులో వచ్చిన వార్తలు చూసి.. అమెరికాలో ఉన్న అఖిల్ తన వంతు సాహాయం చేసేందుకు ముందుకొచ్చారు.
ఇవీ చదవండి: వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించండి: సీఎం జగన్