పరిపాలన రాజధానిగా అమరావతి నే కొనసాగించే వరకు ఉద్యమాన్ని ఆపమని అమరావతి రైతులు, ఐకాస నేతలు స్పష్టం చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఉద్యమం 200 రోజుకు చేరుకున్న సందర్భంగా తుళ్లూరు మండలం వెలగపూడిలో మహా దీక్ష నిర్వహించారు. ఈ దీక్షలో రైతులు, ఐకాస, జనసేన, తెదేపా నేతలు పాల్గొన్నారు. అమరావతి ఉద్యమంలో ప్రాణాలు కొల్పోయినవారికి నేతలు నివాళులర్పించారు. రైతుల త్యాగాలను వృథా కానీయమంటూ నేతలు శపథం చేశారు.
గుంటూరులో ఐకాస ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. బృందావన్ గార్డెన్స్‌లో, చంద్రమౌళి నగర్లో రైతులకు మద్దతుగా నిరసన వ్యక్తం చేశారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు. ప్రభుత్వం అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా ఉంచుతామని ప్రకటన చేసేంత వరకు తమ ఉద్యమాన్ని ఆపమని తేల్చి చెప్పారు.
రాయపూడిలో కృష్ణానది తీరాన ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి యువజన విభాగం అధ్యక్షుడు నిరసన చేపట్టారు. పక్కలోతు ఇసులో కూరుకపోయి యువత భవిష్యత్తు అంధకారం చేయవద్దని నినదించారు.
ఇదీ చదవండి: 'అద్భుత రాజధాని అవకాశాన్ని ప్రభుత్వం దూరం చేసింది'