రాజధానికి శంకుస్థాపన చేసి ఐదేళ్లు పూర్తికావడంతో.. అమరావతి ప్రాంత రైతులు, మహిళలు కాగడాల ర్యాలీ నిర్వహించారు. 'అమరావతి వెలుగు' పేరిట ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో.. మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు మండలాల ప్రజలు పాలుపంచుకున్నారు.
ఉద్ధండరాయునిపాలెంలోని రైతులు గురువారం వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రికి కాగడాల ర్యాలీతో హోరెత్తించారు. మోదీ మాస్కు ధరించి.. 'జై అమరావతి' అంటూ నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: