ETV Bharat / state

దిల్లీ రైతుల ధర్నాలో అమరావతి నినాదం - Delhi farmers protest news

దిల్లీలో రైతు సంఘాలకు అమరావతి రైతులు మద్దతు తెలిపారు. ఘాజీపూర్ దీక్షాస్థలి వద్ద అమరావతి రైతుల గళాన్ని వినిపించారు. ప్రధాని మోదీ అన్నదాతలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దళిత ఐకాస నాయకుడు పులి చిన్న డిమాండ్ చేశారు.

amaravati farmers support to Delhi farmers protest
దిల్లీ రైతుల ధర్నాలో అమరావతి నినాదం
author img

By

Published : Feb 4, 2021, 10:52 AM IST

రాజధాని రైతులు అమరావతి నినాదాన్ని దిల్లీలో లేవనెత్తారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు అమరావతి అన్నదాతలు మద్దతు పలికారు. మహిళా ఐకాస నాయకురాలు రాయపాటి శైలజ, దళిత ఐకాస నాయకుడు పులి చిన్నతో 20 మంది రైతులు దిల్లీలో ఆందోళన చేస్తున్న అన్నదాతల ధర్నాలో పాల్గొన్నారు.

దిల్లీ రైతుల ధర్నాలో అమరావతి నినాదం

రైతులకు నష్టం కల్గించే చట్టాలను రద్దు చేయాలని అన్నదాతలతో కలసి నినాదాలు చేశారు. అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ అనంతరం రైతులను మోసం చేశారని అక్కడి అన్నదాతల దృష్టికి తీసుకెళ్లారు. ఇపుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల పేరును తెరపైకి తీసుకొచ్చి తమను రోడ్డుపై పడేసిందని అమరావతి రైతులు చెప్పారు. తాము సమయం చూసుకొని అమరావతికి వస్తామని బీకేఎస్ నాయకులు చెప్పారని పులి చిన్న తెలిపారు.

ఇదీ చూడండి.

అమ్మ ఒడి నగదు అడిగినందుకు.. విద్యార్థికి చెంపదెబ్బల శిక్ష!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.