గుంటూరు జైలు నుంచి విడుదలైన రాజధాని రైతులు - rajadhani protest latest
ఈనెల 20న ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ రోజా వాహనం అడ్డగించిన కేసులో అరెస్టైన రైతులు ఇవాళ గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. ఈనెల 25న అరెస్టైన 15 మందికి... ఇవాళ బెయిల్ మంజూరు కావటంతో వారిని జైలు అధికారులు విడుదల చేశారు. పోలీసుల తీరుపై మండిపడ్డ రైతులు... అమరావతి అంటేనే అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలైన రాజధాని రైతులు