కౌలు అడిగేందుకు వెళ్తే తమవారిని అక్రమంగా అరెస్ట్ చేస్తారా.. ఇదేనా రైతు ప్రభుత్వం అని అమరావతి పరిధిలోని గ్రామాల అన్నదాతలు ప్రశ్నించారు. పాఠశాలలు తెరిచే సమయం దగ్గర పడుతున్నందున కౌలు డబ్బులు అడిగేందుకు వెళ్తే పోలీసులతో కొట్టిస్తారా అని నిలదీశారు. ప్రభుత్వ తీరుపై మందడం, వెలగపూడి రైతులు మండిపడ్డారు.
న్యాయస్థానాల్లో కేసుల కోసం ఖర్చు పెట్టే డబ్బులతో తమకు కౌలు చెల్లించవచ్చని చెప్పారు. తమ ఆకాంక్షకు వ్యతరేకంగా ప్రభుత్వం ఎక్కడికి వెళ్లినా ఎదురుదెబ్బలు తగులుతున్నాయని గుర్తు చేశారు. తమకు ఈ ప్రభుత్వంపై నమ్మకం పోయిందని స్పష్టం చేశారు. తమను పెయిడ్ ఆర్టిస్టులంటున్న వైకాపా నేతలు.. ఆ ఆరోపణలను రుజువు చేయకపోతే రాజీనామా చేస్తారా అని నిలదీశారు. రాజధానిపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపైనా అన్నదాతలు ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇవీ చదవండి: