రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు, మహిళలు చేస్తున్న ధర్నాలు 198వ రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు మండలం మందడం, మల్కాపురం, తుళ్లూరు, దొండపాడు, రాయపూడి, అనంతవరం గ్రామాల్లో రైతులు, మహిళలు, చిన్నారులు ధర్నాలో పాల్గొన్నారు. ఉద్యోగుల గృహసముదాయాల వద్ద మహిళలు ఆందోళన చేపట్టారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. దాదాపు 90శాతం పూర్తైన భవనాలను ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలని డిమాండ్ చేశారు. సీడ్ యాక్సిస్ రహదారిపై చిన్నారులు, మహిళలు నిరసన వ్యక్తం చేశారు.
అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతుల ఆందోళన ! - అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు ఆందోళన !
అమరావతి రైతుల ఆందోళనలు 198వ రోజుకు చేరుకున్నాయి. పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు, మహిళలు, చిన్నారులు నిరసన వ్యక్తం చేశారు.