సీఆర్డీఏ రద్దు, 3 రాజధానుల బిల్లుపై రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంతకాలు చేయొద్దంటూ అమరావతి రైతులు డిమాండ్ చేశారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని.. తాము గత 214 రోజులుగా ఆందోళన చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొని న్యాయం చేయాలని రైతులు గవర్నర్ ను వేడుకున్నారు. సంతకం చేసే ముందు ఒక్కసారి పునరాలోచించాలని విన్నవించారు. మరోవైపు పరిపాలన రాజధాని అమరావతినే కొనసాగించాలని కోరుతూ.. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమి, మందడం, రాయపూడి, మల్కాపురం, దొండపాడు గ్రామంలో రైతులు, మహిళలు, చిన్నారులు ధర్నాలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో రికార్డుస్థాయిలో కరోనా కేసులు, మరణాలు