ETV Bharat / state

రాజధాని రైతుల్లో అభద్రతాభావం - amaravathi latest news

రాజధాని అమరావతి  వ్యవహారాన్ని ముఖ్యమంత్రి జగన్‌ వద్దే తేల్చుకోవాలని ఆ ప్రాంత రైతులు నిర్ణయించారు. ఈ మేరకు తుళ్లూరులో సమావేశమైన  అమరావతికి భూములిచ్చిన రైతులు....భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాలు చట్టపరంగా ఉన్నందున ఇబ్బంది లేదని... అవసరమైతే న్యాయపోరాటానికి వెనకాడేదిలేదన్నారు. మంత్రుల భిన్నరకాల వ్యాఖ్యలు సరికాదంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

amaravathi farmers met on capital issue
రాజధాని రైతుల్లో అభద్రతాభావం
author img

By

Published : Nov 26, 2019, 6:25 AM IST

రాజధాని రైతుల్లో అభద్రతాభావం

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణ పనులు నిలిచిపోవటం, రాజధాని వేరే చోటుకు మారుస్తారనే ఊహాగానాలు, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో.. రాజధాని రైతులు గుంటూరు జిల్లా తుళ్లూరులోని ఓ కళ్యాణ మండపంలో సోమవారం సమావేశమయ్యారు. రాజధాని పరిధిలోని అన్ని గ్రామాల నుంచి... అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ఈ సమావేశానికి హాజరయ్యారు. గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం భూములు, స్థలాలు ఇచ్చి అమరావతిలో ప్లాట్లు పొందిన వారు సమావేశానికి వచ్చారు.

ఒప్పందాన్ని అమలుచేయాల్సిందే..!

రాజకీయ విమర్శలకు తావు లేకుండా కేవలం భవిష్యత్తు కార్యాచరణ, ప్రభుత్వంతో సంప్రదింపులు, న్యాయపోరాటం వంటి అంశాలపై రైతులు చర్చించారు. మంత్రుల ప్రకటనలు కొంత ఆందోళనకు గురి చేస్తున్నట్లు రైతులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి నిధుల సమస్య ఉంటే... విభిన్నమైన మార్గాల్లో సమీకరించుకునేందుకు అవకాశాలు ఉన్నాయని రైతులు సూచించారు. గత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలపై సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే రాజధాని కోసం భూములను త్యాగం చేశామని... గత ప్రభుత్వంతో ఎన్నోసార్లు సంప్రదింపులు జరిపి చట్టపరమైన ఒప్పందాలు చేసుకున్నామని రైతులు గుర్తుచేసుకున్నారు. 9.14 ఒప్పందం ప్రకారం రైతులకు ఎక్కడా నష్టం జరిగే అవకాశం లేదని... ఒప్పందంలోని ప్రతి అంశాన్ని ప్రభుత్వం అమలు చేసి తీరాల్సిందేనని సుధాకర్ అనే రైతు స్పష్టం చేశారు.

రాజధానిపై స్పష్టతేదీ

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే కొంచెం ఆలస్యం కావొచ్చు గాని... రాజధానిలో అభివృద్ధి మాత్రం జరగాల్సిందేనన్నారు. ప్రస్తుతం రాజధానిలో ఉన్న భూముల్లో సగం భూముల్ని ప్రైవేటు సంస్థలకు కేటాయిస్తే... అమరావతికి కావాల్సిన నిధులు వస్తాయని... లేక సీఆర్డీఏ బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుని అభివృద్ధి చేయవచ్చని సూచించారు. రాజధానిపై అన్ని పార్టీలు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశాయని స్వరాజ్యరావు అనే రైతు గుర్తు చేశారు. రైతులంతా భూములిచ్చింది రాజధాని కోసమేనని... కాబట్టి ఇక్కడ అమరావతి నిర్మాణ జరిగితీరాల్సిందేనని స్పష్టం చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో సీఆర్డీఏపై జరిగే చర్చలో అమరావతిపై తేల్చాలని నర్శింహరావు అనే రైతు డిమాండ్ చేశారు. అమరావతిని మరోచోటికి తరలించటం సాధ్యం కాదన్నారు. రాజధానికి 5వేల కోట్లు ఇస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని ఆ నిధులు తెచ్చేందుకు ప్రయత్నించాలని రాష్ట్రప్రభుత్వానికి సూచించారు.

మంత్రుల వ్యాఖ్యలతో గందరగోళం

రాజధాని ఒక వర్గానికి చెందినది మాత్రమేనన్న ప్రచారంతో నష్టం జరిగినట్లు రైతులు అభిప్రాయపడ్డారు. ఇక్కడ చంద్రబాబు సామాజికవర్గంతో పాటు అన్ని కులాల వారు.. ఉన్న విషయాన్ని రైతులు ప్రస్తావించారు. ఎంతో పకడ్బందీగా తప్పుడు ప్రచారం చేశారని... దాన్ని ఇకనైనా తిప్పికొట్టాలని రైతులు తీర్మానించారు. గ్రామాల వారిగా కమిటీలు ఏర్పడాలని... అందులో అన్ని వర్గాల వారికి చోటు కల్పించాలని నిర్ణయించారు. అలాగే ప్రభుత్వంతో సంప్రదింపుల కోసం సెంట్రల్ కమిటీని ఏర్పాటు చేయాలని తీర్మానించారు. న్యాయపోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు రైతులు ప్రకటించారు. రాజధాని విషయంలో ఇంతటి గందరగోళానికి కారణం మంత్రుల వ్యాఖ్యలేనని... వాటికి ముఖ్యమంత్రి తెరదించి స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని రైతులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే వివిధ రాజకీయ పక్షాల నేతలను కలిశామని... అదే క్రమంలో ముఖ్యమంత్రితో సమావేశం కావాలని నిర్ణయించారు. రాజధాని ప్రాంతంలో రైతు కూలీలకు ఇస్తున్న పింఛను రూ.2 వేల 500 నుంచి రూ.5 వేలకు పెంచాలని ప్రతిపాదించారు.

రాజధాని పనులు నిలిచిపోవటం వలన రాష్ట్ర అభివృద్ధిపై ప్రభావం పడుతుందని రైతులు అభిప్రాయపడ్డారు. పనులు ఆగిపోయిన కారణంగా ఇక్కడ ఆర్థిక కార్యకలాపాలు మందగించాయని... స్వయం ఉపాధి కుంటుపడిందనే అభిప్రాయం రైతులు వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి :

రాజధానిపై ముఖ్యమంత్రి నోరు విప్పాలి: రైతులు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.