రాజధాని అమరావతి ప్రాంత రైతులు కొందరు విజయవాడలోని సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ లక్ష్మీనరసింహంతో సమావేశమయ్యారు. సీఎంతో జరిగిన సీఆర్‌డీఏ సమీక్ష సమావేశం అనంతరం అపోహలు తొలగించారని కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ నిర్మాణాల సముదాయం, భవనాల నిర్మాణంలో అనవసరమైన ఆర్భాటాలకు పోకుండా... పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారని కమిషనర్ వారికి తెలిపారు.
సీఆర్‌డీఏ పరిధిలోని రహదారులను ప్రాధాన్యక్రమంలో నిర్మిస్తామని... కృష్ణానది సమీపంలో కొండవీటి వాగు, పాలవాగు వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని... గత ప్రణాళికకు అనుగుణంగా చర్యలు చేపడతామని అధికారులు వివరించినట్లు రైతులు చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పనలో అనవసర వ్యయం తగ్గించి, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వ ఉద్దేశమని రైతులు వివరించారు.
ఇదీ చదవండి