ETV Bharat / state

అమరావతి కార్పొరేషన్ పై ప్రజాభిప్రాయ సేకరణ.. మళ్లీ ప్రారంభం కానున్న గ్రామసభలు

author img

By

Published : Jan 9, 2022, 8:36 PM IST

అమరావతి కార్పొరేషన్ ఏర్పాటుపై గ్రామ సభల రెండు రోజుల విరామం అనంతరం.. సోమవారం తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు జరిగిన తొమ్మిది గ్రామ సభల్లోనూ.. ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా రాజధాని రైతులు తీర్మానాలు చేశారు.

amaravathi corporation grama sabhalu are to be restarted from 10th december
మళ్లీ ప్రారంభం కానున్న గ్రామ సభలు

అమరావతి కార్పొరేషన్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు.. గ్రామ సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభలకు రెండు రోజులు విరామం ఇచ్చారు. ఇప్పటి వరకు 9 గ్రామాల్లో సభలు నిర్వహించగా.. సోమవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి.

ఇప్పటి వరకు జరిగిన తొమ్మిది గ్రామ సభల్లోనూ.. ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్మానాలు చేశారు. ఏ ఒక్క గ్రామం కూాడా.. 19 గ్రామాలతో కూడిన కార్పొరేషన్ కు అనుకూలంగా తీర్మానం చేయలేదు. తమకు 19 గ్రామాలతో కూడిన కార్పొరేషన్ వద్దని.. 29 గ్రామాలతో కూడిన అమరావతి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు.

గ్రామ సభల్లో రాజధాని రైతులు స్పష్టంగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. అమరావతిని ముక్కలు చేయవద్దని.. 29 గ్రామాలను కలిపే ఉంచాలని తీర్మానిస్తున్నారు. సోమవారం తుళ్లూరు మండలంలోని బోరుపాలెం, అబ్బురాజుపాలెం, నెక్కల్లు, అనంతవరం గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. ఈ నెల 12న గ్రామ సభలు ముగియనున్నాయి.

ఇదీ చదవండి:
ప్రొబేషన్ డిక్లరేషన్ సాధనే లక్ష్యంగా.. గ్రామసచివాలయ ఉద్యోగుల కార్యాచరణ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.