పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ... రైతులు చేస్తున్న ఉద్యమం 350వ రోజుకు చేరుకుంది. తుళ్లూరు, వెలగపూడి, మందడం, కృష్ణాయపాలెం, నీరుకొండ గ్రామాల్లో రైతులు ఆందోళన కొనసాగించారు. వెలగపూడిలో రోడ్డుపై నిలబడి నిరసన తెలిపారు. తుళ్లూరు దీక్షా శిబిరంలో మహిళలు వినూత్న రీతిలో ఆందోళన చేశారు. 350 సంఖ్యపై కూర్చొని జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ మందడంలో మహిళలు నినదించారు.
ఇదీచదవండి.