ETV Bharat / state

హస్తిన బాట పట్టిన అమరావతి రైతులు.. 3 రోజులు ఆందోళనలు - ఢిల్లీకి వెళ్తున్న అమరావతి రైతులు

Agitation of Amaravathi farmers: సీఎం జగన్​ మూడు రాజధానుల ప్రకటన చేసి మూడేళ్లవుతున్న సందర్భంగా దిల్లీలో నిరసనలకు అమరావతి ఐకాస సిద్ధమైంది. ఇందుకోసం అమరావతి రైతులు విజయవాడ నుంచి ప్రత్యేక రైలులో హస్తినకు బయల్దేరారు. ఈనెల 17, 18, 19 తేదీల్లో దిల్లీలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.

Amaravati Farmers
అమరావతి రైతులు
author img

By

Published : Dec 15, 2022, 5:09 PM IST

Updated : Dec 15, 2022, 7:40 PM IST

Amavarathi Farmers to Delhi : అమరావతి వ్యవహారంలో జగన్ చేస్తున్న మోసాన్ని దేశం మొత్తానికి తెలియజేస్తామని రాజధాని రైతులు స్పష్టం చేశారు. అమరావతి ఉద్యమం మొదలై ఈనెల 17కి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన చేసేందుకు విజయవాడ నుంచి ప్రత్యేక రైలులో దిల్లీ బయలుదేరారు. రాజధాని రైతులకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, రైతు సంఘ నేతలు సంఘీభావం తెలిపారు.

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేసి మూడేళ్లవుతున్న సందర్భంగా ధరణి కోట నుంచి ఎర్రకోట వరకూ నిరసన యాత్రకు అమరావతి రైతులు సిద్ధమయ్యారు. డిసెంబర్ 17, 18, 19 తేదీల్లో దిల్లీ వేదికగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. 17వ తేదీన జంతర్ మంతర్​లో ధర్నా చేపట్టి,.. 18వ తేదీన ఇతర రాష్ట్రాల ఎంపీలను కలిసి అమరావతి గోడు వినిపించనున్నారు. 19వ తేదీన రాంలీలా మైదానంలో జరిగే కిసాన్ సంఘ్ కార్యక్రమంలో అమరావతి రైతులు పాల్గొంటారు. 21వ తేదీన తిరిగి విజయవాడ చేరుకుంటామని ఐకాస నేతలు తెలిపారు.

అమరావతే ఏకైక రాజధాని అని న్యాయస్థానం స్పష్టం చేసినా.. ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేదని ఐకాస నేతలు విమర్శించారు. ముఖ్యమంత్రి సోదరి అరెస్టుపై స్పందించిన ప్రధాని, స్వయంగా శంకుస్థాపన చేసిన అమరావతిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అమరావతి రైతుల గొంతుకను ప్రధానికి వినిపించట్లేదా అని ప్రశ్నించారు. ప్రధాని మద్దతుతోనే వైకాపా మూడు రాజధానుల నాటకం ఆడుతోందనే ప్రచారానికి తెరదించాల్సిన బాధ్యత మోదీపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని అమరావతి ఐకాస నేతలు డిమాండ్ చేశారు.

ఈరోజు దాదాపు 1600మంది రైతులతో ప్రత్యేక రైలులో దిల్లీ వెళ్తున్నాం. రేపు సాయంత్రానికి దిల్లీ చేరుకుని.. 17వ తేదీన జంతర్ మంతర్​లో ధర్నా చేస్తాము.. రెండో రోజు పార్లమెంట్ సమావేశాల సందర్బంగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులను కలుస్తాం. మూడో రోజున ప్రధాని మోదీ, అమిత్ షా, సోనియా గాంధీ, సీపీఎం సీపీఐ, కేజ్రీవాల్, అలాగే తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్​లను కలిసి మా సమస్య వివరిస్తాం.ఆంధ్రప్రదేశ్​లో జగన్ మోసం చేస్తున్నాడు. రైతులతో మూడు రాజధానులని అబద్ధం చెప్తున్నాడు. 'ఒక్క రాజధాని కట్టలేని వాడు మూడు రాజధానులు కడతాడా'.. రాష్ట్రాన్ని సీఎం అప్పుల్లో నెట్టేశాడు. ఈ విషయం దేశం మొత్తం తెలియజేయడానికి దిల్లీ వెళ్తున్నాము. -అమరావతి రైతులు

ఇవీ చదవండి:

Last Updated : Dec 15, 2022, 7:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.