ఐఏఎస్ సాధించటంతో పాటు ప్రజలకు వినూత్న సేవలను అందించగలిగితేనే ఆ పదవికి సార్ధకత లభిస్తుందని విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య సూచించారు. గుంటూరులోని విజ్ఞాన్‌లో చదువుకొని ఆలిండియా సివిల్స్ లో 76వ ర్యాంకు సాధించిన సూర్యతేజను ఘనంగా సన్మానించారు. చదువుతో పాటు సమాజంపై అవగాహనను నేర్పించడం వలనే ఈ రోజు విద్యార్థులు వారి జీవితంలో అత్యున్నత స్థానాలకు చేరుకుంటున్నారని ఆయన తెలిపారు. జీవితంలో మనం ఎన్ని శిఖరాలను అధిరోహించినా, మనం ఈ రోజు ఈ స్థాయికి రావడానికి కృషి చేసిన ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను, శ్రేయోభిలాషులను మరువకూడదని మరో ముఖ్య అతిథిగా హాజరైన టుబాకో బోర్డు చైర్మన్ అద్దంకి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
ఒకటి, రెండు ప్రయత్నాల్లో రానంత మాత్రాన నిరుత్సాహపడకూడదని.. తాను మొదటి మూడు సార్లు ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అవ్వలేదని, నాలుగో ప్రయత్నంలో ఇంటర్య్వూ వరకు వెళ్లానని సూర్యతేజ వెల్లడించారు. చివరగా ఐదో ప్రయత్నంలో ఆలిండియా స్థాయిలో 76వ ర్యాంకు సాధించడంతో పాటు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచానని పేర్కొన్నారు.
ఇవీ చూడండి...