గుంటూరు జిల్లా నాదెండ్లలో ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద మందు బాబులు క్యూ కట్టారు. చిలకలూరిపేట, నరసరావుపేట, తాడికొండ, గుంటూరు, ప్రత్తిపాడులో మద్యంప్రియులు నాదెండ్ల దుకాణం వద్దకు భారీ సంఖ్యలో చేరారు. దీంతో ఆ దుకాణం వద్ద కోలాహలం సంతరించుకుంది. వీరి వల్ల తమ ఊర్లో కరోనా వస్తుందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. మందు బాబులు మాత్రం మాకు మద్యం దొరిగితే చాలు అంటూ ..ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇదీ చూడండి. వాట్సాప్ గ్రూప్లో అశ్లీల వీడియోలు.. వ్యక్తిపై కేసు నమోదు