గుంటూరు జిల్లా క్రోసూరు, అచ్చంపేట మండలం పీసపాడు గ్రామాల్లో నకిలీ ఆర్మూర్ మిర్చి విత్తనాలను వ్యవసాయ అధికారులు గుర్తించారు. జిల్లా కార్యాలయానికి వచ్చిన సమాచారంతో మండలాల్లోని మిరప నర్సరీలను అధికారులు పరిశీలించారు. ఈ తనిఖీల్లో.. కొందరు రైతులు ఎలాంటి బిల్లులు లేకుండానే ఆర్మూర్ మిరప విత్తనాలను కొని నాటినట్లు గుర్తించారు. రైతు భరోసా కేంద్రంలో ఉన్న ఆర్మూర్ విత్తనాలతో పోల్చిచూడగా.. రైతులు కొన్నవి నకిలీ విత్తనాలుగా అధికారులు గుర్తించారు. విత్తనాలు వేసి నష్టపోయిన రైతులు మండల వ్యవసాయ అధికారులు లేదా జిల్లా కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని గుంటూరు జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకురాలు విజయభారతి సూచించారు.
ఇదీచదవండి.