రాష్ట్రంలో యూరియా కొరత ఎక్కడా లేదని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు అన్నారు. ఉద్యానశాఖపై గుంటూరులోని కమిషనర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది అదనంగా లక్ష ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఉపాధి హామీ క్రింద 5లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు వేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. అరటి,మామిడి ఎగుమతులపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. కొత్తగా జాజికాయ సాగుకు ప్రోత్సాహకం ఇవ్వటంతో పాటు... పసుపు, అల్లం పంటల్లో మంచి దిగుబడులు ఇచ్చే కొత్త రకాలను ఈ ఏడాది ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.
ఉద్యాన రైతులకు సంబంధించి వంద రైతు ఉత్పత్తి సంఘాలు ఏర్పాటు చేసి... వారికి ప్రాసెసింగ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు. యూరియా కొరతపై స్పందిస్తూ... కొందరు వ్యాపారులు కృత్తిమ కొరత సృష్టించి ధరలు పెంచాలని చూస్తున్నారని... అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఏడాది పెరిగిన డిమాండ్ మేరకు యూరియా సరఫరా చేసేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నామన్నారు.
ఇదీ చదవండి