ETV Bharat / state

agrigold victims: హోంమంత్రిని కలిసేందుకు అగ్రిగోల్డ్ బాధితుల యత్నం.. అడ్డుకున్న పోలీసులు

గుంటూరులో అగ్రిగోల్డ్ బాధితులు (agrigold victims protest) నిరసన చేశారు. హోం మంత్రి సుచరిత (home minister sucharitha) ని కలిసేందుకు వెళ్లిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. అధికారంలోకి వస్తే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామన్న ముఖ్యమంత్రి జగన్ (CM jagan)... తన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

గుంటూరులో అగ్రిగోల్డ్ బాధితుల నిరసన
గుంటూరులో అగ్రిగోల్డ్ బాధితుల నిరసన
author img

By

Published : Jul 15, 2021, 7:04 PM IST

తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ... గుంటూరులో అగ్రిగోల్డ్ బాధితులు నిరసన చేశారు. హోం మంత్రి సుచరితను కలిసేందుకు వెళ్లిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. అధికారం చేపట్టిన వారం రోజుల్లోనే అగ్రిగోల్డ్ బాధితులకు పూర్తి న్యాయం చేస్తామని.. ఆత్మహత్యకు, అసహజ మరణానికి పాల్పడ్డ వారికి రూ.10 లక్షలు పరిహారం చెల్లిస్తామన్న ముఖ్యమంత్రి హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం స్పందించకుంటే ఈ నెల 22 నుంచి 31 వరకు విజయవాడలో నిరసన కార్యక్రమాలు చేపడతామని అగ్రిగోల్డ్ బాధితులు హెచ్చరించారు. అనంతరం హోం మంత్రిని కలిసేందుకు ఇద్దరిని మాత్రమే పోలీసులు అనుమతించారు.

ఇదీ చదవండి:

కృష్ణా జిల్లా పూర్వ కలెక్టర్‌ ఇంతియాజ్‌కు.. వారెంట్‌ జారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.