కరోనా లాక్డౌన్ ఆంక్షలు క్రమంగా తొలగిపోతున్న తరుణంలో షాపింగ్ మాల్స్‌కు ప్రభుత్వం అనుమతించింది. ఈ క్రమంలో గుంటూరు నగరంలో ముఖ్యమైన మాల్స్ అన్నీ తెరచుకున్నాయి. మాల్స్ యజమానులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని కొనుగోలుదారులను లోపలకి అనుమతిస్తున్నారు.
జాగ్రత్తలివే..!
- ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి. మాస్క్ లేకపోతే షాపింగ్ మాల్ వారే అందజేస్తున్నారు. కొందరైతే గ్లౌజులు కూడా ఇస్తున్నారు.
- భౌతిక దూరం పాటించేలా మార్కింగ్ వేశారు.
- కొన్ని షాపింగ్ మాల్స్‌లో లోపలకు ప్రవేశించే సమయంలోనే క్రిమి సంహారక టన్నెల్ ద్వారా వెళ్లేలా ఏర్పాట్లు.
- వినియోగదారుల పేర్లు, ఫోన్ నెంబర్లు రికార్డులో నమోదు చేసుకుంటున్నారు.
- వినియోగదారులకు థర్మల్ స్కానర్ ద్వారా పరీక్షలు.
- ప్రతి ఒక్కరూ శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకునేలా చర్యలు.
- ఎప్పటికప్పుడు మాల్ మొత్తాన్ని శానిటైజ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి: