వ్యవసాయ చట్టాలను రద్దు చేసి స్వామినాథన్ కమిషన్కు చట్టబద్ధత కల్పించాలని ప్రముఖ నటుడు ఆర్. నారాయణమూర్తి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అఖిల భారత రైతు సంఘాల సమన్వయ కమిటీ దాచేపల్లి విభాగం.. దిల్లీ ఉద్యమానికి మద్దతుగా మంగళవారం రాత్రి నారాయణపురంలో భారీ బహిరంగసభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా నారాయణమూర్తి హాజరయ్యారు.
వ్యవసాయ చట్టాలతో దళారీ వ్యవస్థ మరింత పెరుగుతుందని ఆయన చెప్పారు. ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదముందన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో .. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచే ప్రమాదం కూడా ఉందని పేర్కొన్నారు. చట్టాలను వ్యతిరేకించాల్సిన రాష్ట్రాలు కేంద్రానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.
ఇదీ చదవండి: అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ యాగం