TRS Mlas Buying Issue update: ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ముగ్గురు నిందితులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిందితులను అరెస్ట్ చేయడానికి అనుమతి ఇస్తూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను.. సీజేఐ ధర్మాసనం ముందు నిందితుల తరఫున న్యాయవాదులు ప్రస్తావించారు. దీనిపై శుక్రవారం విచారణ కేసుల జాబితాలో చేర్చాలని రిజిస్ట్రీని సీజేఐ ధర్మాసనం ఆదేశించింది.
అసలేం జరిగిందంటే: ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఏసీబీ ప్రత్యేక కోర్టు ఈ నెల 7కు వాయిదా వేసింది. నిందితులకు బెయిల్ మంజూరు చేయాలని.. ఇప్పటికే పూర్తి వివరాలు సేకరించారని దర్యాప్తునకు సహకరిస్తారని నిందితుల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నిందితుల అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి బెయిల్ ఇవ్వాలని మరో పిటిషన్ దాఖలు చేశారు.
సింహయాజి స్వామిజీ, రామచంద్ర భారతి అనారోగ్యంతో బాధపడుతున్నారని వాళ్ల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కోర్టు.. పిటిషన్‌ను ఈ నెల 7కు వాయిదా వేసింది. తెరాసను వీడి భాజపాలో చేరితే రూ.100 కోట్లతో పాటు సివిల్ కాంట్రాక్టు పనులు ఇస్తామని ప్రలోభపెట్టారని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి: