గుంటూరు జిల్లా అప్పికట్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. మృతుడు విజయవాడకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మేడ అరవింద్‌గా గుర్తించారు. గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలంలోని స్నేహితుని వివాహానికి వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. నలుగురు స్నేహితులు కారులో వివాహానికి వెళ్తుండగా... గేదె అడ్డురావడంతో కారు అదుపు తప్పి గుంతలో పడిపోయింది. క్షతగాత్రులను ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి.. ఓటు వేయలేదని గోడ కట్టేశారు!