ద్విచక్రవాహనంపై వెళ్లేందుకు లిఫ్టు అడిగిన వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన చిలకలూరిపేట మండలం లింగంగుట్ల వద్ద గురువారం చోటు చేసుకుంది. కోమటినేనివారిపాలెం గ్రామానికి చెందిన కె. కోటేశ్వరరావు ద్విచక్రవాహనంపై గురువారం రాత్రి చిలకలూరిపేట పట్టణం నుంచి ఇంటికి వెళుతున్నాడు. పట్టణంలోని ఎన్నార్టీ సెంటర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి కోటేశ్వరరావును లిఫ్టు అడిగాడు. కాదనలేక సదరు వ్యక్తిని తన వాహనంపై కోటేశ్వరరావు ఎక్కించుకున్నాడు. ద్విచక్ర వాహనం చిలకలూరిపేట-నరసరావుపేట మార్గంలో లింగంగుంట్ల వంతెన వద్దకు వెళ్ళే సరికి వెనుక కూర్చున్న వ్యక్తి ఒక్కసారిగా వెనక్కి పడిపోయాడు. బ్యాలెన్స్ తట్టుకోలేక ద్విచక్రవాహనం నుంచి కోటేశ్వరరావు కూడా కిందపడ్డాడు. వెనుక కూర్చున్న వ్యక్తి తలకు బలమైన గాయం అయ్యి అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. మృతుని వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసినట్లు చిలకలూరి పేట గ్రామీణ ఎస్సై భాస్కర్ తెలిపారు.
ఇదీ చదవండి :