సంగం డెయిరీలో శుక్రవారం తనిఖీలు చేసేందుకు జాప్యం జరగడంతో శనివారానికి వాయిదా వేశారు ఏసీబీ అధికారులు. ఉదయం నుంచి పై అంతస్తులోని కార్యాలయంలో ఏసీబీ అధికారులు పలు దస్త్రాలను తనిఖీ చేస్తున్నారు. నిన్న వడ్లమూడిలోని సంగం డెయిరీ పరిపాలన భవనంలో ఏసీబీ సోదాలు చేసేందుకు వచ్చారు. అయితే తాళాలు ఛైర్మన్ వద్దనే ఉన్నాయని చెప్పడంతో సాయంత్రం వరకు వేచి ఉన్నారు.
ఒక దశలో తాళాలు పగలగొట్టేందుకు ప్రయత్నించిన అధికారులు.. ప్రయత్నాన్ని విరమించుకున్నారు. సాయంత్రానికి తాళాలు తీసుకున్నప్పటికీ సమయం మించిపోయిందని.. శనివారం కార్యాలయాన్ని తెరిచి తమకు అవసరమైన దస్త్రాలను పరిశీలిస్తామని కార్యాలయాన్ని సీజ్ చేశారు. ఈ మేరకు ఇవాళ ఉదయం నుంచే తనిఖీలు మెుదలుపెట్టారు.
ఇదీ చదవండి: కరోనా రోగుల కోసం 180 కి.మీ. ప్రయాణించి సేవలు