పొలానికి పాస్ పుస్తకం అడిగిన రైతు వద్ద లంచం డిమాండ్ చేసిన వీఆర్వోను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. మాచర్ల మండలంలోని కంభంపాడు గ్రామానికి చెందిన పిట్టల నర్సయ్య అనే రైతు... తన తండ్రి పెద్దనాగయ్య పొలం పట్టాదారు పాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్నారు.
దీని కోసం కంభంపాడు వీఆర్వో కె. వెంకటశివరావు రూ. 65 వేలు లంచం డిమాండ్ చేశారు. నర్సయ్య అంత ఇచ్చుకోలేనని ప్రాధేయ పడితే.. రూ.55 వేలు ఇమ్మని అడిగాడు. దీంతో నర్సయ్య ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. గ్రామ శివారులోని జింకలబొడు వద్ద వీఆర్వోకు బాధితుడు డబ్బులు ఇస్తుండగా.. ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ కుమార్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి, వీఆర్వోను పట్టుకున్నారు. అనంతరం గుంటూరుకు తరలించారు.
ఇదీ చదవండి:
murder case chased : హత్య కేసు ఛేదన... ప్రేమ వ్యవహారమే కారణం