ETV Bharat / state

వర్సిటీల్లో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించకుండా నిరోధించాలి: ఏబీవీపీ - abvp protest in state higher education office mangalagiri

ABVP Protest: రాష్ట్రంలో విద్యా విధానాన్ని నిరసిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద ఏబీవీపీ నేతలు ధర్నా నిర్వహించారు. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లారు. విద్యార్థులతో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య హేమ చంద్రారెడ్డి చర్చలు జరిపారు.

ABVP Protest
రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద ఏబీవీపీ నేతలు ధర్నా
author img

By

Published : Mar 31, 2022, 2:58 PM IST

ABVP Protest: మంగళగిరిలోని రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉద్రిక్తత తలెత్తింది. ఏబీవీపీ (ABVP) నేతలు ఉన్నత విద్యా మండలి కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. ఈక్రమంలో పోలీసులు, ఏబీవీపీ నాయకుల మధ్య తీవ్ర తోపులాటలు జరిగాయి. భయంతో ఉద్యోగులు కార్యాలయ తలుపులు మూసేశారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి విద్యార్థులతో చర్చలు జరిపారు. వర్సిటీల్లో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించకుండా నిరోధించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. జీవో నం.77 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. విశ్వవిద్యాలయాల్లో పర్మినెంట్ వీసీలను నియమించాలని కోరారు. యూజీసీ నిబంధనల ప్రకారమే సెట్లు నిర్వహిస్తున్నామని, కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా పని చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేసి వెళ్లేందుకు సిద్ధమని హేమచంద్రారెడ్డి అన్నారు.

రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద ఏబీవీపీ నేతలు ధర్నా

ఇదీ చదవండి: ప్రొద్దుటూరు మున్సిపల్‌ సమావేశం రసాభాస.. కౌన్సిలర్ల తోపులాట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.