ETV Bharat / state

ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం... 48 గంటల డెడ్​లైన్​: చంద్రబాబు

రాజధాని వ్యవహారాన్ని ప్రజల్లో తేల్చుకుందాం.. రమ్మని వైకాపా నేతలకు చంద్రబాబు సవాల్ విసిరారు. 48 గంటల్లో అసెంబ్లీని రద్దు చేయండని డిమాండ్ చేశారు. ఈలోపు స్పందించకపోతే మళ్లీ మీడియా ముందుకొస్తానని చెప్పారు. రాజీనామాలు చేయడానికి తెలుగుదేశం ఎమ్మెల్యేలు సిద్ధమని చంద్రబాబు స్పష్టం చేశారు.

chandra babu
chandra babu
author img

By

Published : Aug 3, 2020, 5:43 PM IST

Updated : Aug 4, 2020, 9:22 AM IST

మీడియాతో చంద్రబాబు

మూడు రాజధానులు నిర్ణయం సరైనదని భావిస్తే.. దానికి ప్రజామోదం ఉందనుకుంటే అసెంబ్లీని రద్దు చేసి.. అందరం కలిసి ఎన్నికలకు వెళ్దామని.. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామని.. తెదేపా అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్​కు సవాల్​ విసిరారు. 'ప్రజలు మళ్లీ మిమ్మల్నే గెలిపిస్తే మేం మాట్లాడడం ఆపేస్తాం.. వారి నిర్ణయాన్ని శిరసావహిస్తాం. ఏ విషయమూ 48 గంటల్లో చెప్పండి.' అని డిమాండ్​ చేశారు. హైదరాబాద్​లోని తన నివాసం నుంచి చంద్రబాబు వీడియో సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ప్రణాళికను బైబిల్​, భగవద్గీత, ఖురాన్​గా భావిస్తున్నామనే వైకాపా.. 3 రాజధానుల విషయాన్ని అందులో ఎందుకు పెట్టలేదని ఆయన నిలదీశారు. ప్రజలకు చెప్పకుండా చేయడమంటే నమ్మక ద్రోహమేనని ధ్వజమెత్తారు. ఐదేళ్లకు ఓట్లేశారని.. 5 కోట్ల మంది జీవితాలతో ఆడుకునే హక్కు వైకాపాకు లేదని దుయ్యబట్టారు.

మాట మార్చారు..

అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్​.. ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేదన్నారని చంద్రబాబు గుర్తు చేశారు. మరి ఇది ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం కాదా అని మండిపడ్డారు. 2014 సెప్టెంబర్​ 4న ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్​ అసెంబ్లీలో అమరావతిపై చెప్పిన మాటలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.

భూ కబ్జాల కోసమేనా..?

రాజధాని అమరావతిలోనే కొనసాగుతుందని వైకాపా ఎన్నికల కమిటీ ఛైర్మన్​ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సహా పలువురు నేతలు చెప్పిన వైనాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. అందరి మాటలను చదివి వినిపించారు. విశాఖలో భూకబ్జాలు, దందాలు చేయాలనుకుంటున్నారా..? అని ఆగ్రహం వెలిబుచ్చారు. అప్పుడు రాజధానిని స్వాగతిస్తున్నామన్న ధర్మాన ప్రసాదరావు ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని అని నిలదీశారు.

మాకు నిమిషం పని..!

'మా పార్టీ శాసనసభ్యుల రాజీనామా ఒక్క నిమిషం పని. సమస్య పరిష్కారం అవుతుందంటే చేస్తాం.' అని చంద్రబాబు స్పష్టం చేశారు. అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్దామనే తన సవాల్​ను స్వీకరిస్తారా..? ప్రజలకు వెన్నుపోటు పొడుస్తారా..? అని నిలదీశారు. రాజధాని మార్పు అనేది వైకాపా సొంత విషయం కాదని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు రాజధాని మార్పు అంశం ప్రస్తావించి ఉంటే.. ఎక్కడ చెప్పారో వెల్లడించాలన్నారు.

తెలివి తక్కువ నిర్ణయం

జగన్​ పాలనపై పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలకు చెందిన డాక్టర్​ కృష్ణారెడ్డి సామాజిక మాధ్యమాల్లో ఉంచిన స్పందనను చంద్రబాబు చదివి వినిపించారు. తాను పదేళ్లుగా జగన్​ అభిమానినని పేర్కొన్న ఆయన.. ఏడాది పాలన చూస్తుంటే ఎందుకు ఓటేశానా అనిపిస్తోందని.. చెప్పారని చంద్రబాబు ప్రస్తావించారు.

'3 రాజధానుల నిర్ణయం పెద్ద తప్పు. దానికి మద్దతివ్వను. దీనికి 75 శాతం ప్రజలు వ్యతిరేకం. రాజశేఖర్​రెడ్డి హయాంలోని నిర్ణయాలను కిరణ్​కుమార్​రెడ్డి కొనసాగించారు. అభివృద్ధి చెందిన ఇతర దేశాలను కాకుండా.. దక్షిణాఫ్రికాను ఎందుకు ఉదాహరణగా తీసుకున్నారో అర్థం కావడం లేదు' అని కృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు చదివి వినిపించారు.

సీఎం జగన్​కు ఎంతమాత్రం పరిపూర్ణత ఉన్నా.. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు డిమాండ్​ చేశారు. లేదంటే తన తెలివి తక్కువ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు.

ఇంకా ఎంతమంది బలి కావాలి

రాజధాని కోసం 4 ఎకరాలిచ్చిన రైతు కుటుంబానికి ఈ ప్రభుత్వం తీరని శోకాన్ని బదులుగా ఇచ్చింది. ఇంకా ఎంతమంది రైతులు బలికావాలి. ముందురోజు వరకూ అమరావతి పరిరక్షణ ఉద్యమంలో పాల్గొన్న రాజధాని రైతు నన్నపనేని వెంకటేశ్వరరావు తెల్లవారేసరికి గుండెపోటుతో మరణించడం బాధాకరం. ఈ ప్రభుత్వం చేసిన నమ్మక ద్రోహానికి ఇప్పటికే 81 మంది రాజధాని రైతులు, రైతు కూలీలు ప్రాణాలిచ్చారు. ఇన్ని కుటుంబాలు ఇక్కడ గుండెలు పగిలే బాధల్లో ఉంటే.. ఈ పాలకులకు..కనీసం వచ్చి ఓదార్చే తీరికలేదు.

-చంద్రబాబు, తెదేపా అధినేత

ఇదీ చదవండి..

రాజీనామా చేస్తే 175 గెలుచుకోవచ్చు... జగన్​కు రఘురామ సూచన

Last Updated : Aug 4, 2020, 9:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.