ETV Bharat / state

AArogyasri Bills Pending in Several Hospitals: ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులకు గ్రహణం.. వైద్య సేవలకు వెనకడుగు వేస్తున్న ఆసుపత్రులు... - about AArogyasri Bills Pending

AArogyasri Bills Pending in Several Hospitals: ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు సకాలంలో బిల్లులు చెల్లించలేని దీనస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ వైఫల్యాల వల్ల రోగులకు సేవలందించేందుకు ఆస్పత్రులు వెనకడుగు వేస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం జగన్‌ గతంలో... క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు ఆస్పత్రులకు బిల్లులు చెల్లిస్తున్నామని చెప్పిన మాట... ఒట్టిమూటలా మిగిలిపోయాయి.

Hospitals are facing difficulties due to delay in payment
Hospitals are Facing Difficulties Due to Delay in Payment
author img

By

Published : Aug 19, 2023, 10:14 AM IST

AArogyasri Bills Pending in Several Hospitals : ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు సకాలంలో బిల్లులు చెల్లించలేని దీనస్థితిలోకి వైసీపీ సర్కార్ చేరింది. ప్రభుత్వ చేతగాని తనంతో రోగులకు సేవలందించేందుకు ఆస్పత్రులు వెనకడుగు వేస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం జగన్‌ గతంలో... క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు ఆస్పత్రులకు బిల్లులు చెల్లిస్తున్నామని చెప్పిన మాట... ఒట్టిమూటలా మిగిలిపోతున్నాయనే వాదన వ్యక్తమవుతోంది.

ఆరోగ్యశ్రీ ట్రస్టు మార్గదర్శకాల ప్రకారం క్లెయిమ్‌ పంపిన 60 రోజుల్లోగా చెల్లింపులు పూర్తవ్వాలి. కానీ దీనికి 400 రోజుల వరకు సమయం పడుతోంది. అప్పటికీ బిల్లులొస్తాయన్న గ్యారంటీ లేదు. వాస్తవంగా ఇబ్బంది పడుతున్నది మాత్రం రోగులే. బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం పై ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌(Principal Accountant General) కార్యాలయం వాస్తవాలను వెల్లడించినా.. సర్కారులో చలనం రాలేదు. అసలు జనం బాధలను పట్టించుకునే స్థితిలోనే ప్రభుత్వం లేదు. విసిగిపోయిన అనుబంధ ఆస్పత్రుల యాజమాన్యాలు అడపాదడపా ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. సేవలు నిలిపేయక తప్పదంటూ అల్టిమేటం ఇచ్చినప్పుడు మాత్రమే.... చివరి నిమిషంలో ప్రభుత్వం బిల్లులను చెల్లిస్తోంది. తాజా సమాచారం ప్రకారం కొన్ని ఆస్పత్రులకు మూడు నెలల నుంచి దాదాపు 700కోట్ల వరకు బిల్లులను సర్కారు చెల్లించలేదు.

వైఎస్సార్​ ఆరోగ్య శ్రీ ట్రస్టు.. ప్రచారం ఘనం.. చెల్లింపులు శూన్యం

ఆరోగ్యశ్రీ ట్రస్టు(AAarogyasri Trust) ద్వారా అందించే చికిత్సలు ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో 133 వరకు ఉన్నాయి. ఇందులో 123 చికిత్సలు ప్రైవేటు బోధనాస్పత్రుల్లోనూ ఉన్నాయి. వైద్య విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని నెలకు ఒక్కో ఆస్పత్రి నుంచి 40 కేసులే చూడాలన్న నిబంధన తెచ్చారు. కొన్ని ప్రైవేటు బోధనాస్పత్రుల్లో మాత్రం 133 రకాల చికిత్సలను రోగులకు అందించారు. 2020 డిసెంబర్‌ నుంచి 81 ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ 133 చికిత్సలను అందుబాటులోకి తెచ్చారు. నిబంధనలకు వ్యతిరేకంగా జరిగిన ఈ చర్య వల్ల ప్రభుత్వంపై 1.37 కోట్ల వరకు ఆర్థిక భారం అదనంగా పడింది. I.T. సిస్టమ్‌లో మార్పు చేయనందువల్లనే ఈ పరిస్థితి తలెత్తినట్లు ఆరోగ్యశ్రీ ట్రస్టు వివరణ ఇచ్చింది. అంతేకాకుండా క్లెయిమ్స్‌కు(Aarogyasri claims) తగ్గట్లు తగిన ఆధారాలతో రాకపోవడం వల్ల, కోరిన సమాచారం వచ్చేందుకు జరుగుతున్న జాప్యం వల్ల చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని వివరణ ఇచ్చింది.

మంగళగిరి ఎయిమ్స్​ని ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొస్తాం: మంత్రి విడుదల రజిని

ప్రైవేటు అనుబంధ ఆస్పత్రుల్లో (Hospitals) రోగులకు అందించిన చికిత్సపై క్లినికల్‌, మెడికల్‌, డెత్‌ ఆడిట్‌ జరగలేదు. తృతియపక్షం ద్వారా ఆడిట్‌ జరగలేదు. సత్తెనపల్లి, తాడిపత్రి ఏరియా ఆస్పత్రులకు 2019 మే నుంచి ఆక్టోబరు 2021 మధ్య ఆరోగ్య ట్రస్టు ఇచ్చిన 43.19లక్షలు వినియోగించకుండా బ్యాంకుల్లోనే భద్రపరిచారు. బదిలీల వల్ల వినియోగించలేకపోయినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఒకరు వివరణ ఇచ్చారు. కరోనా సమయంలో మే 2020 నుంచి జులై 2020 మధ్య కొవిడ్‌ బాధితులకు ఎక్స్‌గ్రేషియా నిమిత్తం జిల్లాలకు ఆగోగ్యశ్రీ ట్రస్టు నుంచి 12.41 కోట్లు వెళ్లగా వీటిలో కేవలం 5.28కోట్లే వినియోగించారు. మిగిలిన మొత్తాన్ని వెనక్కి పంపలేదు. వెనక్కు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్యశ్రీ ట్రస్టు వివరణ ఇచ్చింది. 2017-18 నుంచి 2021-22 మధ్య ఆరోగ్యశ్రీ ట్రస్టుకు 7064 కోట్ల వరకు చెల్లింపులు జరిగాయి. ఇందులో ఆయుష్మాన్‌ భారత్(Ayushman Bharat) కింద కేంద్రం నుంచి వచ్చిన 1,042 కోట్లు ఉన్నాయి.

వైద్యసేవల్లో నూతన విధానం.. దేశానికే రోల్​ మోడల్​గా 'ఫ్యామిలీ డాక్టర్‌': సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.